మేడారం స్తూపానికి మళ్లీ ఎరుపు రంగు

మేడారం స్తూపానికి మళ్లీ ఎరుపు రంగు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా మేడారంలోని ఊరట్టం క్రాస్‌‌ వద్ద గల మావోయిస్ట్‌‌ స్తూపానికి మళ్లీ ఎరుపు రంగు వేశారు. మేడారం సుందరీకరణ పనుల్లో భాగంగా మహా జాతర ముందు ఈ స్తూపానికి ఆకు పచ్చరంగు వేశారు. పీడబ్ల్యూఎస్‌‌ నాయకుడు మల్యాల సమ్మన్న అలియాస్‌‌ గట్టన్న ఆధ్వర్యంలో శుక్రవారం స్తూపానికి ఎరుపు రంగు వేశారు. అనంతరం అమరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో పీడబ్ల్యూఎస్‌‌ జిల్లా అధ్యక్షుడు ముంజాల బిక్షపతి  పాల్గొన్నారు.