మేడ్చల్ జిల్లాలో ఉపాధి సేవలు బంద్

మేడ్చల్ జిల్లాలో ఉపాధి సేవలు బంద్

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ సిబ్బంది సేవలను కలెక్టర్ గురువారం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పలు గ్రామాలు, మండలాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో సిబ్బందికి పని లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు ఉన్నారు.