తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్.. 2 తులాల బంగారం, 50 వేల నగదు చోరీ

తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్.. 2 తులాల బంగారం, 50 వేల నగదు చోరీ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. కొర్రెముల గ్రామం లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో 2024 జనవరి 02న చోరీ జరిగింది. ఈ చోరీలో రెండు తులాల బంగారం, రూ. 50 వేల నగదు, ఒక సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. కొత్తకోట ఉదయకాంత్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.

ఈ చోరీని గమనించిన స్థానికులు ఇంటి యజమాని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమచారం అందుకున్న పోలీసులు ఉదయకాంత్ రెడ్డి ఇంటికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.