ఘనంగా మల్లారెడ్డి 50వ ఏండ్ల పెండ్లి వేడుక.. 50 కిలోల కేక్ కట్ చేసి.. గజమాలతో సత్కరించిన అభిమానులు 

ఘనంగా మల్లారెడ్డి 50వ ఏండ్ల పెండ్లి వేడుక.. 50 కిలోల కేక్ కట్ చేసి.. గజమాలతో సత్కరించిన అభిమానులు 

బోయిన్ పల్లి, వెలుగు: మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దంపతుల 50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు గురువారం బోయిన్​పల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 50 కిలోల కేక్ కట్ చేయగా, అభిమానులు వారిని గజమాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. తన భార్య కల్పన జీవితంలోకి వచ్చిన తర్వాతే తాను అనేక మైలురాళ్లు దాటి ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. యువత తమ అన్యోన్య దాంపత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 75 వసంతాల వేడుకను సైతం చేసుకుంటామని ప్రజల అభిమానం ఆశీస్సులు తమపై ఉండాలని ఆకాంక్షించారు.