ఉరకలేస్తున్న మేడ్చల్ పెద్ద చెరువు అలుగు..

ఉరకలేస్తున్న మేడ్చల్ పెద్ద చెరువు అలుగు..

భారీ వర్షాలు కురవడంతో మేడ్చల్ పెద్ద చెరువు అలుగు ఉరకలేస్తుంది.  భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పరుగులెత్తడంతో మేడ్చల్ పెద్ద చెరువుకి వరద ప్రవాహం జోరందుకుంది.  మేడ్చల్ పెద్ద చెరువు అలుగు పారుతు ఉదృతంగా ప్రవహిస్తుంది.  అయినా   అక్కడ ఎలాంటి ప్రమాద సూచొకలు కాని,,బారీకేడ్లు కాని ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మేడ్చల్ పెద్ద చెరువు అలుగు పారి, మేడ్చల్ నుంచి షామీర్‌పేట్‌  వెళ్లే  రోడ్డు కిష్టాపూర్  వాగు ఉధృతంగా ప్రవహిస్తుండంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు.   ఓ వాహన దారుడు అదుపు తప్పి పడపోయే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. వాహనదారులు భారీగా వస్తున్న నీటి నుండే వెల్లడంతో ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో భయంతో ప్రయాణిస్తూ. ద్విచక్ర వాహనా దారులు భయం భయంతో వాగు దాటుతున్నారు. ఇప్పటికైనా భారీ కేడ్లు ఏర్పాటు చేసి వరద తగ్గే వరకు వాహనా దారులు వెళ్లకుండా చూడాలని కోరుతున్నారు

ALSO READ | వరద నష్టం ఎంతో పూర్తి వివరాలివ్వండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మేడ్చల్‌ పట్టణంలోని పెద్ద చెరువు అలుగు పారే వాగుపై పాత వంతెన ఒక పక్క భాగం పాక్షికంగా కూలిపోయింది. భారీ వర్షాలతో అలుగు ప్రవాహానికి వంతెనకు బీటలువారాయి. వంతెన కింది భాగంలో పెద్దఎత్తున పెచ్చులూడి పైనుంచి లోపల వైపు పూడ్చుకుపోయి పెద్ద గుంతలా మారింది. అలుగు మరింత ఉధృతంగా ప్రవహిస్తే వంతెన మొత్తం కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు. కాగా, జాతీయ రహదారిపై చేపడుతున్న పనుల కారణంగా పట్టణంలో ప్రవేశించే వాహనదారులు చెక్‌పోస్టు నుంచి నేరుగా పెద్ద చెరువు కట్ట మీద నుంచి పట్టణంలోకి ప్రవేస్తున్నారు. దాంతో కట్టపై వాహనాల రాకపోకలు పెరిగి శిథిలావస్థకు చేరిన వంతెన పై నుంచి ఎక్కువ వాహనాలు వెళితే అది కూలే స్థితికి చేరుకుంటుందని స్థానికులు వాపోతున్నారు.