
ఐపీఎల్ 2025 సీజన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. శనివారం (మే 24) పంజాబ్ కింగ్స్ పై ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ టాప్-2 లో నిలవాలనే ఆశలను సంక్లిష్టం చేసింది. మొదట బౌలింగ్ విఫలమైన ఢిల్లీ.. ఆ తర్వాత బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించింది, సమీర్ రిజ్వి (25 బంతుల్లో 58:3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి తోడు కరుణ్ నాయర్ (44) కీలక ఇన్నింగ్స్ ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి గెలిచింది.
207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు డుప్లెసిస్, రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ పవర్ ప్లే ను ఉపయోగించుకుంటూ బౌండరీల వర్షం కురిపించారు. ఓ వైపు వికెట్లు కాపాడుకుంటూనే మరోవైపు వేగంగా పరుగులు రాబట్టారు. దీంతో పవర్ ప్లే లో ఢిల్లీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. మంచి టచ్ లో కనిపించిన రాహుల్ (35) ఆరో ఓవర్లో జాన్సెన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. డుప్లెసిస్ (23) కూడా వెంటనే పెవిలియన్ కు చేరడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది.
ALSO READ | ENG vs IND: ఆ ముగ్గురికి గోల్డెన్ ఛాన్స్.. టెస్ట్ స్క్వాడ్‌లో ఊహించని ప్లేయర్లు వీరే!
ఈ దశలో అటల్, కరుణ్ నాయర్ ఒక చిన్న భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అటల్ 2 సిక్సులు కొట్టి 11 ఓవర్లో ఔట్ కావడంతో ఢిల్లీ 93 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో కరుణ్ నాయర్ బాధ్యతగా ఆడాడు. సమీర్ రిజ్వితో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. 44 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ నాయర్ ఔటైన తర్వాత సమీర్ రిజ్వి రెచ్చిపోయి ఆడాడు. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్ లో ఉండి ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించాడు. పంజాబ్ బౌలర్లలో హరిప్రీత్ బ్రార్ రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, ప్రవీణ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.
అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ హాఫ్ (34 బంతుల్లో 53:5 ఫోర్లు,2 సిక్సర్లు) సెంచరీతో సత్తా చాటగా.. స్టోయినిస్(16 బంతుల్లో 44:4 సిక్సర్లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ వచ్చేసింది. శ్రేయాస్ అయ్యర్ (53) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లు.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది.
Delhi Capitals sign off with a big W 👏#PBKSvDC SCORECARD ⏩ https://t.co/DAHtseuO1D pic.twitter.com/oScyYKHVF6
— ESPNcricinfo (@ESPNcricinfo) May 24, 2025