ఐటీఆర్‌‌‌‌‌‌‌‌ ఫైల్ చేయడానికి సిద్ధమా .. ఈ సెక్షన్లు ముఖ్యం

ఐటీఆర్‌‌‌‌‌‌‌‌ ఫైల్ చేయడానికి సిద్ధమా .. ఈ సెక్షన్లు ముఖ్యం
  • కొత్త, పాత ట్యాక్స్ రిజీమ్‌‌‌‌లను ఎంచుకోవడంలో సాయపడతాయి
  • ట్యాక్స్ డిడక్షన్స్‌‌‌‌ను క్లెయిమ్ చేసుకొని భారాన్ని తగ్గించుకోవచ్చు
  • వచ్చే ఏడాది ఫైల్ చేసే ఐటీఆర్‌‌‌‌లకు  ‘రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్‌‌‌‌’ బెనిఫిట్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్ రిటర్న్‌‌‌‌ (ఐటీఆర్‌‌‌‌‌‌‌‌)  ఫైల్ చేసే టైమ్‌‌‌‌ వచ్చింది.  దేశవ్యాప్తంగా టాక్స్‌‌‌‌పేయర్లు  తమ ఐటీఆర్‌‌‌‌‌‌‌‌లను  ఫైల్ చేయడానికి రెడీ అవుతున్నారు. 2024–-25 ఆర్థిక సంవత్సరం కోసం మీ ఐటీఆర్‌‌‌‌‌‌‌‌ సబ్మిట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే, కొన్ని కీలక టాక్స్ సెక్షన్స్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. టాక్స్ భారాన్ని  తగ్గించుకోవడానికి ఇవి సాయపడతాయి. 

అంతేకాకుండా  పాత టాక్స్ విధానం లేదా కొత్త టాక్స్ విధానంలో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇన్‌‌‌‌కమ్ టాక్స్ డిపార్ట్‌‌‌‌మెంట్ అసెస్‌‌‌‌మెంట్ ఇయర్ 2025–-26 (2024–25 ఆర్థిక సంవత్సరం) కోసం ఇప్పటికే ఐటీఆర్‌‌‌‌‌‌‌‌-1, ఐటీఆర్‌‌‌‌‌‌‌‌-4 ఫారమ్స్ అందుబాటులోకి తెచ్చింది. మొత్తం ఆదాయం ఏడాదికి రూ.50 లక్షల లోపు ఉంటే,  ఇండివిడ్యువల్స్, చిన్న వ్యాపారాలు ఈ ఫారమ్స్‌‌‌‌ను వాడొచ్చు. 

రిటర్న్‌‌‌‌ ఫైల్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన సెక్షన్లు ఇవే..

  సెక్షన్ 80సీ: ఇన్వెస్ట్ చేసి, డిడక్షన్ పొందొచ్చు

ఒకవేళ మీరు పాత టాక్స్ విధానం ఎంచుకుంటే, సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్స్ క్లెయిమ్ చేయొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌‌‌‌), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌‌‌‌), ఈఎల్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ మ్యూచువల్ ఫండ్, 5- ఏళ్ల కాలపరిమితి గల ఫిక్స్డ్‌‌‌‌ డిపాజిట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్‌‌‌‌ వంటి వాటిలో చేసే పెట్టుబడులను ట్యాక్స్ డిడక్షన్‌‌‌‌ కోసం వాడొచ్చు.  

కొత్త విధానం‌‌‌‌లో, సెక్షన్ 80సీసీడీ(2) కింద జీతం పొందేవారు  తమ యజమాని నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌‌‌‌పీఎస్‌‌‌‌)కి చేసే కంట్రిబ్యూషన్‌‌‌‌లో 10 శాతం వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. బిజినెస్‌‌‌‌లు సెక్షన్ 80జేజేఏఏ, 80సీసీహెచ్‌‌‌‌ కింద కొన్ని నిర్ధిష్టమైన ఖర్చులపై డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. 

సెక్షన్ 80డీ: హెల్త్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్

హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చేసే ప్రిమియంలపై  సెక్షన్ 80డీ కింద టాక్స్ డిడక్షన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ట్యాక్స్‌‌‌‌పేయర్ తన కోసం, భార్య లేదా భర్త, పిల్లల (అందరూ 60 ఏళ్ల లోపు ఉంటే) కోసం రూ.25 వేల వరకు, పేరెంట్స్ 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే రూ.50 వేల వరకు , మీరు, మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితే మొత్తం  రూ.లక్ష వరకు  డిడక్షన్‌‌‌‌ క్లెయిమ్ చేయొచ్చు. ఈ బెనిఫిట్ పాత, కొత్త రెండు టాక్స్ విధానాల్లోనూ అందుబాటులో ఉంది. 

సెక్షన్ 24బీ: హోమ్ లోన్ వడ్డీ

హోమ్ లోన్‌‌‌‌పై చెల్లించే వడ్డీపై  సెక్షన్ 24బీ కింద ఏడాదికి రూ.2 లక్షల వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇది పాత, కొత్త రెండు టాక్స్ విధానాల్లోనూ అప్లై అవుతుంది. ఈ డిడక్షన్ కేవలం వడ్డీ కోసం మాత్రమే. అసలుపై ఉండదు.

సెక్షన్ 10 (3ఏ): హౌస్ రెంట్ అలవెన్స్

మీరు అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేస్తున్న కంపెనీ నుంచి హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఏ  తీసుకుంటే, సెక్షన్ 10 (3ఏ) కింద హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఏ మినహాయింపును  క్లెయిమ్ చేయొచ్చు. మీ యాన్యువల్ రెంట్ రూ. లక్ష  కంటే ఎక్కువ ఉంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది. కానీ ఈ బెనిఫిట్ పాత టాక్స్ విధానం‌‌‌‌లో మాత్రమే అందుబాటులో ఉందని పర్సనల్​ ఫైనాన్స్​ ఎక్స్​పర్టులు చెబుతున్నారు.