వీ6, వెలుగు న్యాయపోరాటానికి..దిగొచ్చిన సర్కారు

వీ6, వెలుగు న్యాయపోరాటానికి..దిగొచ్చిన సర్కారు

పత్రికా స్వేచ్ఛపై అరుదైన కేసు
ఓపెన్ కోర్టులో లోతుగా విచారణ జరుపుతాం
V6 – వెలుగు పిటిషన్ పై హైకోర్టు కామెంట్
సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్ కి ఆంక్షలు విధించడం
రాజ్యాంగ ఉల్లంఘన కాదని సర్కారే నిరూపించుకోవాలన్న కోర్టు
సెక్రటేరియట్ బిల్డింగ్ల కూల్చివేత కవరేజీకి అనుమతి
ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి తీసుకెళ్లిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు: అత్యంత రహస్యంగా చేపట్టిన సెక్రటేరియట్ బిల్డింగ్ల కూల్చివేత కవరేజీకి మీడియాను అనుమతించకపోవడంపై వీ6 చానల్, వెలుగు పేపర్ చేసిన న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. వందలాది మంది పోలీసులను మోహరించి బిల్డింగ్ల కూల్చివేత కవరేజీని అడ్డుకున్న సర్కారు ఎట్టకేలకు ఆంక్షలను సడలించింది. వీ6, వెలుగు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే.. ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు మీడియాకు పర్మిషన్ ఇచ్చింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సిటీ పోలీసు కమిషన ర్ మీడియాను వెంట బెట్టుకుని కూల్చివేత పనులు జరుగుతున్న చోటుకు ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లారు. కరోనా ఎఫెక్ట్ ఉన్నా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వ్యాన్లు, బస్సుల్లో పదుల సంఖ్యలో మీడియా ప్రతినిధులను ఎక్కించారు. గేటు దగ్గర నుంచి 100 మీటర్ల వరకు మాత్రమే వారిని అనుమతించారు. వెహికల్స్ ఎక్కినప్పటి నుంచి దిగే వరకూ పోలీసు పహారాలోనే మీడియా కవరేజీ మొత్తం సాగింది.

కూల్చివేత కవరేజీని అడ్డు కోవడంపై పోరాటం

ఈ నెల 6వ తేదీ అర్ద‌రాత్రి నుంచి భారీ బందోబస్తు మధ్య సెక్రటేరియట్ కూల్చివేత పనులు మొదలు పెట్టారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడంతోపాటు చుట్టుపక్కల కిలోమీటర్ వరకు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు. కూల్చివేత పనులు కవరేజ్ చేసేందుకు మీడియాకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై వీ6,- వెలుగు హైకోర్టులో పిటిషన్ వేసింది. కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వార్ జోన్లకు వెళ్లేందుకు కూడా మీడియాను అనుమతిస్తుంటే, సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్ ను ఎందుకు అడ్డుకుంటు న్నారని ప్రశ్నించింది. భద్రత, రక్షణ చర్యల్లో భాగంగా మీడియాను అనుమతించబోమని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. విచారణలో సందర్భంగా పలుమార్లు ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పు బట్టింది. ఈ నేపథ్యంలో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా మీడియాను ఫొటోలు, వీడియో కవరేజీకి ఆహ్వానించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎటుచూసినా మట్టి దిబ్బలే

సెక్రటేరియట్ లో ఎటు చూసినా మట్టిదిబ్బలే కనిపించాయి. 10 మీటర్లనుంచి 15 మీటర్లఎత్తున
శిథిలాలే ఉన్నాయి. మొత్తం 11 బ్లాకుల్లో 95 శాతం కూల్చివేత పూర్తయ్యింది. తెలంగాణ సెక్ర
టేరియట్ కు కేటాయించిన ఏ, బీ, సీ, డీ బ్లాకులు పూర్తిగా నేలమట్టమయ్యాయి. జీ బ్లాక్ ఏరియాను
పూర్తిగా చదును చేశారు. ఎనిమిదేండ్ల క్రితం అంటే 2012లో నిర్మించిన నార్త్ హెచ్, సౌత్ హెచ్
బ్లాకులు సైతంకూల్చేశారు. తెలంగాణ ఎంట్రీ గేటు పక్కనే ఉండే రాక్ బిల్డింగ్ను కూడా పూర్తిగా కూ
ల్చేశారు. జే, ఎల్ బ్లాకులను 70 శాతం కూల్చగా.. వాటిని పూర్తిగా నేలమట్టం చేసేందుకు 2 హైడ్రాలిక్
మిషన్లు పనిచేస్తున్నాయి.

గుడి, మసీద్ నేలమట్టం

సెక్రటేరియట్లోని గుడి, రెండు మజీద్లూ నేలమట్టం అయ్యాయి. నల్లపోచమ్మ టెంపుల్ పూర్తిగా కూ
ల్చేశారు. గుడి ఉన్న ఏరియాలో 10 మీటర్ల ఎత్తున మట్టి దిబ్బలున్నాయి. సీ బ్లాక్, డీ బ్లాక్ పక్కన ఉండే
మసీద్ సైతం కూల్చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ..