వచ్చే యేడాది నారాయణపేటలో మెడికల్ ​కాలేజీ  

వచ్చే యేడాది నారాయణపేటలో మెడికల్ ​కాలేజీ  
  • మెడికల్ కాలేజీ వచ్చే యేడు
  • ఈ యేడు నర్సింగ్​ కాలేజీ మంజూరు చేస్తం
  • ధన్వాడకు 108 అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ సాంక్షన్
  • వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌​రావు

నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాకు వచ్చే యేడాది మెడికల్​ కాలేజీ  మంజూరు చేస్తామని, ఈ యేడు నర్సింగ్​కాలేజీ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇస్తామని  వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌​రావు తెలిపారు.  సోమవారం నారాయణపేటలోని అప్పంపల్లిలో   రూ. 56 కోట్లతో చేపట్టిన 390 పడకల ప్రభుత్వ ఆస్పత్రి,  రూ. 1.25 కోట్ల టీడయాగ్నస్టిక్ , రేడియాలజీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూ. 45 లక్షలతో నిర్మించనున్న కెమిస్టు, డ్రగ్గిస్టు అసోసియేషన్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన చేశారు. అలాగే  ఎర్రగుట్ట నుంచి ఎక్లాస్ పూర్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు రూ. 5.98 కోట్లతో నిర్మించిన 5.5 కి.మీ. బీటీ రోడ్డు,  రూ. 1.20 కోట్లతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడే  ఉన్న చిల్ట్రన్స్‌‌‌‌‌‌‌‌ ఆస్పత్రిని పరిశీలించి పేషెంట్లతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ పట్టించుకోని నారాయణ పేటను తెలంగాణ వచ్చాక జిల్లాగా ఏర్పాటు చేసి అభివద్ధి చేస్తున్నామన్నారు.  పేటలో వచ్చేయేడు  మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని,  ఇందుకు భూమి ఇచ్చిన రైతులకు పరిహారం కోసం వెంటనే రూ. 2 కోట్లు రిలీజ్‌‌ చేస్తామన్నారు. డయాగ్నస్టిక్‌‌‌‌‌‌‌‌,  రేడియాలజీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మూడు నెలల్లో కంప్లీట్ చేస్తామని,   ధన్వాడకు 108 అంబులెన్స్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కోయిల్‌‌‌‌‌‌‌‌ కొండ సీహెచ్‌‌‌‌‌‌‌‌సీని వైద్య విధాన పరిషత్‌‌‌‌‌‌‌‌లో కలిపేలా ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు.  పాలమూరు–రంగారెడ్డి ద్వారా నారాయణపేట జిల్లాకు నీరు అందిస్తామని, కర్వెన పనులు 80శాతం కంప్లీట్​ అయ్యాయన్నారు.

పేటను అభివృద్ధి చేస్తున్నం
ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ  చీరలు, బంగారు ఆభరణాలకు ఫేమస్‌‌‌‌‌‌‌‌ అయిన నారాయణపేటను  వ్యాపార పరంగా  అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  పేట రూపురేఖలు మారిపోయాయని,  కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్పీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రభుత్వ ఆఫీసు ఇలా.. అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు.  ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం వెల్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ సెంటర్ మంజూరు చేయాలని మంత్రిని కోరారు.  అలాగే ప్రభుత్వ ఆస్పత్రిలో  డైట్, శానిటేషన్ టెండర్లు పూర్తి అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని,  ప్రభుత్వ ఆస్పత్రిలో నియామకాలు చేపట్టాలని రిక్వెస్ట్ చేశారు. అనంతరం మహిళా సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు.  కలెక్టర్ హరిచందన, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జడ్పీ చైర్‌‌‌‌ పర్సన్‌‌ వనజమ్మ, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,  నరేందర్ రెడ్డి,  అబ్రహం, డీసీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, వైద్య విధాన పరిషత్‌‌‌‌‌‌‌‌ కమిషనర్  అజయ్ కుమార్, స్టేట్ మైనారిటీ అసోసియేషన్ చైర్మెన్ ఇంతియాజ్ ఇసాక్,  మున్సిపల్ చైర్మన్ గందె అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయన్ భట్టాడ్, ఎంపీపీ ఆమ్మకోళ్ల శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ అంజలి, సర్పంచ్ వెంకటమ్మ పాల్గొన్నారు.