
ఖానాపూర్, వెలుగు: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఖానాపూర్ పట్టణంలో నడుపుతున్న రెండు ప్రైవేట్ హాస్పిటల్స్‌ను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ సీజ్ చేశారు. గురువారం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లను డాక్టర్ రాజేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూనాని డాక్టర్‌గా చెలామణి అవుతున్న గీత క్లినిక్ యజమాని క్లినిక్‌లో మాత్రం వేరే రకం ఇంజక్షన్లు వాడుతున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. దీంతో సదరు క్లినిక్‌ను సీజ్ చేశారు.
విద్యానగర్ ప్రాంతంలో ఉన్న సూర్య ఆస్పత్రిని ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నడుపున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో రాజేందర్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా హాస్పిటల్స్ నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో ఎంహెచ్ఎన్ జిల్లా నోడల్ అధికారి సౌమ్య, జిల్లా మాస్ మీడియా అధికారి రవీందర్తదితరులు పాల్గొన్నారు.