కొడిమ్యాల,వెలుగు : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మెడికల్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి మండల కేంద్రంలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో షట్టర్ తాళం వేసి ఇంటికి వెళ్లిపోగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో షాపు నుంచి మంటలు వ్యాపించాయి.
గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. అప్పటికే షాప్ పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని యజమాని రమేశ్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపాడు.