పెరగనున్న మెడిసిన్ ధరలు.. ఎప్పటి నుంచి.. ఎంతెంత అంటే

పెరగనున్న మెడిసిన్ ధరలు.. ఎప్పటి నుంచి.. ఎంతెంత అంటే

ఇప్పటికే నిత్యవసర ధరలు  చాలా కాస్ట్ లీ అయ్యాయి.   వీటికి తోడు ఇపుడు  నిత్యావసర మందుల ధరలు 12 శాతం పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి   వినియోగదారులపై అదనపు భారం పడనుంది.  ఏప్రిల్ 1 నుంచి  పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్, కార్డియాక్ మందుల ధరలు పెరగనున్నాయి. మందుల ధరలు పెరగడం ఇది వరుసగా రెండో ఏడాది.  

 షెడ్యూల్ చేసిన మందులకు 10 శాతానికి పైగా పెంచడానికి ప్రభుత్వం అనుమతించింది. అత్యవసర ఔషధాల జాబితాలో ఉండే 800 షెడ్యూల్డ్‌ మందుల ధరలు ఈ మేర‌కు పెరుగుతాయి. ధరలు పెరిగే వాటిలో  పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, గుండెకు సంబంధించినవి, క్షయ, ఇతర వ్యాధులకు సంబంధించినవి ఉన్నాయి.  

వార్షిక టోకు ధరల సూచిక (WPI) ఆధారంగా ధరల పెంపునకు  ఆమోదం ఇవ్వబడుతుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీల విలువను నిర్ణయించే నియంత్రణ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA)మార్చి 27న దీనికి సంబంధించి సూచన ఇచ్చింది. వార్షిక టోకు ధరల సూచిక ప్రకారం ఔషధ కంపెనీలు మందుల ధరలను పెంచవచ్చు. ధరల పెంపు సామాన్య ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నప్పటికీ   కంపెనీలు ఉపశమనం పొందుతాయి.