EHS లో ‘మందుల’ స్కామ్‌

EHS లో ‘మందుల’ స్కామ్‌

సీపీఎం హైదరాబాద్ కార్యదర్శి శ్రీనివాస్‌‌ ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: వెల్‌ నెస్‌ సెంటర్లకు పంపిణీ చేసే మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని సీపీఎం హైదరాబాద్‌ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ ఆరోపించారు. 2016 నుం చి 2018 వరకు ఈహెచ్‌‌ఎస్‌ (ఎంప్లాయీస్‌ హెల్త్‌‌ స్కీమ్‌ ), జేహెచ్ఎస్(జర్నలిస్ట్స్‌‌ హెల్త్‌‌ స్కీమ్‌ ) సీఈవోగా పని చేసిన ఓ అధికారిణి నిబంధనలకు విరుద్ధంగా మందుల కొనుగోలు జరిపారన్నారు. సోమవారం మీడియాతోమాట్లాడుతూ, నిబంధనల ప్రకారం ప్రభుత్వం తో ఒప్పం దం (రేట్‌ కాంట్రాక్టర్ లు) చేసుకున్న కాం ట్రాక్టర్లకు బదులు నాన్‌ రేట్‌ కాంట్రాక్టర్ల వద్ద అధిక ధరలకు మందులు కొనుగోలు చేశారన్నారు. రూ.కోట్ల విలువైన మందుల కొనుగోలుకు కనీసం టెండర్లు కూడా పిలవలేదని ఆరోపించారు. సదరు అధికారిణి ఈఎస్‌ఐకి బదిలీ అయ్యాక, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌ బోర్డు ఉన్నతాధికారులు విచారణ జరిపి అక్రమాలు నిజమేనని తేల్చారని చెప్పారు. ఉన్నతాధికారులు, ఆరోగ్యశ్రీ బోర్డు ఆమెపై చర్యలకు సిఫారసు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శిం చారు.ఇదే అధికారిణి ఈఎస్‌ ఐలోనూ మందుల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపైనా ఆమె విచారణ ఎదుర్కొంటున్నారని చెప్పారు. రూ.కోట్ల ప్రజాధనం వృథా అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా స్పందించి మందుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిం చాలని డిమాండ్ చేశారు.