పద్మారావునగర్,వెలుగు: సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన అకలేషియా కార్డియా వ్యాధితో బాధపడుతున్న 61 ఏళ్ల వృద్ధురాలికి ఆధునిక పర్ ఓరల్ ఎండోస్కోపీ మైథమీ(పీవోఈఎం) విధానం ద్వారా చికిత్స అందించింది. ఆహారం, ద్రవాలు మింగలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని డాక్టర్లు రక్షించారు. శరీరంపై ఎలాంటి కోతలు లేకుండా పూర్తిగా ఎండోస్కోపిక్ పద్ధతిలో పీవోఈఎం ప్రక్రియ ద్వారా వైద్యం చేశారు.
దీంతో ఆమె యథావిథిగా ఆహారం తీసుకునే స్థాయికి వచ్చారు. దవాఖాన సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కృష్ణగోపాల్ మాట్లాడుతూ.. పీవోఈఎం వంటి ఆధునిక పద్ధతులు అన్నవాహిక వ్యాధులకు, శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం అని చెప్పారు.
