
- 300 పడకలతో సూపర్ స్పెషాలిటీ సేవలు
పద్మారావునగర్, వెలుగు:సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ 24వ బ్రాంచ్ ప్రారంభమైంది. 300 పడకలతో సూపర్ స్పెషాలిటీ సేవలను అందించేలా ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రారంభించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో అధునాతన ఆసుపత్రిని ఏర్పాటు చేసిందన్నారు.
సంజయ్ మాట్లాడుతూ.. మెడికవర్ డాక్టర్లు సేవాదృక్పథంతో పనిచేయాలన్నారు. పొన్నం మాట్లాడుతూ.. మెడికవర్ హాస్పిటల్ ఉత్తమ సేవలతో ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. అనిల్ కృష్ణ, కార్పొరేటర్లు కొంతం దీపిక, చీర సుచిత్ర పాల్గొన్నారు.