మేడికుంట చెరువుపై కబ్జాదారుల కన్ను

మేడికుంట చెరువుపై కబ్జాదారుల కన్ను
  • స్థలాన్ని ఆక్రమించి షెడ్లు, గుడిసెలు ఏర్పాటు

మాదాపూర్​, వెలుగు: హైటెక్​సిటీ మాదాపూర్​లో​ఉన్న మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోంది. బేగంపేట గ్రామ పరిధిలో 24 ఎకరాల 19 గంటల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు గతంలో నీటితో కళకళలాడేది. ఇందులో నీరు నిండాకే సున్నం చెరువులోకి వచ్చి చేరేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం ఈ లేక్​ నీరు లేక వెలవెలబోతుండగా.. ఇదే అదనుగా అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. చెరువు స్థలంలో మట్టిని నింపే భారీ షెడ్లు ఏర్పాటు చేశారు. 

ప్రైవేట్​ వాహనాల పార్కింగ్​కు స్థలాన్ని వాడుతున్నారు. స్థలాన్ని కాపాడేందుకు ఇరిగేషన్​ ఆఫీసర్లు చుట్టూ ఫెన్సింగ్​ ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులు దానిని తొలగించి మరీ మట్టిని నింపారు. భారీ కారు మెకానిక్​ షెడ్లు వెలిశాయి. మరోవైపు కొందరు గుడిసెలు వేసి అద్దెకిస్తున్నారు. టీ కొట్లు, పాన్​ షాప్​లు నడుస్తున్నాయి. ఈ కబ్జాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.