మేడిపల్లి పీఎస్​​ను తనిఖీ చేసిన రాచకొండ సీపీ

మేడిపల్లి పీఎస్​​ను తనిఖీ చేసిన రాచకొండ సీపీ

మేడిపల్లి, వెలుగు:  మేడిపల్లి పోలీస్​ స్టేషన్​ను  రాచకొండ  సీపీ సుధీర్ బాబు మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను సోమవారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.  సీడీ ఫైళ్లను తనిఖీ చేసి, విచారణను సమీక్షించారు.  స్టేషన్ రికార్డులను పరిశీలించడంతో పాటు రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల పనితీరు, సీసీటీవీల నిర్వహణ వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.  సమస్యాత్మక ప్రాంతాల సిబ్బంది ఎప్పుడూ  అప్రమత్తంగా ఉండాలని  ఆదేశించారు.  మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డికి సూచించారు.