సీలేరు నుంచి రైళ్లు, బస్సుల్లో సిటీకి గంజాయి.. 2.6 కిలోల సరుకు సీజ్

సీలేరు నుంచి రైళ్లు, బస్సుల్లో సిటీకి గంజాయి.. 2.6 కిలోల సరుకు సీజ్

మేడిపల్లి, వెలుగు: ఏపీ నుంచి సిటీకి గంజాయిని తెచ్చి అమ్ముతున్న ముగ్గురిని మల్కాజిగిరి ఎస్ వోటీ, మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారపల్లికి చెందిన కుంచె మణికంఠ(23), చెంగిచర్లకు చెందిన బి. శ్రీధర్(23), అన్నోజిగూడకు చెందిన పి. సాయికుమార్(22) ఈ ముగ్గురు కలిసి ఏపీలోని సీలేరు నుంచి గంజాయిని రైళ్లు, బస్సుల్లో సిటీకి తరలించి అమ్ముతున్నారు. గురువారం చెంగిచర్ల డిపో వద్ద గంజాయిని అమ్ముతున్న ఈ ముగ్గురిని మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.6 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరికి గంజాయిని అందించే సీలేరుకు చెందిన కైల అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గంజాయి అమ్ముతున్న నలుగురు అరెస్ట్

గండిపేట : గంజాయి అమ్ముతున్న నలుగురిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రానికి చెందిన పర్బల్ గోగోయ్(19), రతన్(26), భరత్ గోగోయ్(19), బిట్టు గోగోయ్(19) నలుగురు సిటీకి వచ్చి గచ్చిబౌలి ఏరియాలో ఉంటూ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తెచ్చి నార్సింగి ఏరియాలో అమ్ముతున్నారు. గురువారం నార్సింగిలోని మై హోమ్ అవతార్ అపార్ట్ మెంట్స్ జంక్షన్ వద్ద గంజాయి అమ్ముతున్న ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.