
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ హెల్త్‌కేర్ టెక్నాలజీ కంపెనీ మెడ్‌ట్రానిక్ పీఎల్సీ సిటీలో రూ. 3 వేల కోట్ల (350 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడితో ఇక్కడ ఏర్పాటు చేసిన మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. అమెరికాకు బయట హైదరాబాద్‌లోని మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటరే అతి పెద్దదని వెల్లడించింది. గ్రోత్ స్ట్రేటజీలో భాగంగానే ఈ గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను విస్తరిస్తున్నట్లు తెలిపింది.
మెడ్‌ట్రానిక్ లీడర్షిప్ టీమ్ యూఎస్‌లోని న్యూయార్క్ సిటీలో తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ కే టీ రామారావును కలిసింది. 2020లో ప్రకటించిన 160 మిలియన్ డాలర్లకు ఇప్పుడు పెట్టనున్న పెట్టుబడులు అదనమని కంపెనీ పేర్కొంది. మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లో ప్రస్తుతం 800 మంది పనిచేస్తుండగా, ఈ సంఖ్య రాబోయే 5 ఏళ్లలో 1,500 కి పెంచనున్నారు. ఇంజినీరింగ్, మొబైల్ యాప్స్, అప్లికేషన్ అండ్ డెస్క్‌టాప్ సాఫ్ట్వేర్, క్లవుడ్–వెబ్ యాప్స్, డేటా ఇంజినీరింగ్, ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్, ప్రొడక్ట్ సెక్యూరిటీ, సైబర్–ప్రొడక్ట్ సెక్యూరిటీ వంటి విభాగాలలో దేశంలోని నిపుణులను నియమించుకోనున్నట్లు మెడ్‌ట్రానిక్ వెల్లడించింది.
రోబోటిక్స్, ఇమేజింగ్, నావిగేషన్, సర్జికల్ టెక్నాలజీస్, ఇంప్లాంటబుల్ టెక్నాలజీస్ వంటి కీలకమైన హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగాలలో ఇప్పుడు పెట్టే పెట్టుబడులు తమ కంపెనీకి సపోర్ట్‌గా నిలుస్తాయని పేర్కొంది. గ్లోబల్ మెడ్–టెక్ సెక్టార్లో హైదరాబాద్ ఎదుగుదలకు మెడ్‌ట్రానిక్ తాజా పెట్టుబడుల ప్రకటన నిదర్శనంగా నిలుస్తుందని కే టీ రామారావు ఈ సందర్భంగా చెప్పారు. టెక్నాలజీ ఇన్నోవేషన్‌కు ఇండియా గ్లోబల్ హబ్‌గా మారుతోందని, హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ సెక్టార్లో మరింత పెద్ద మార్కెట్‌గానూ ఇండియా మారుతుందని తాము ఆశిస్తున్నట్లు మెడ్‌ట్రానిక్ ఈవీపీ మైక్ మారినారో పేర్కొన్నారు.