‘హిట్2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మీనాక్షి చౌదరి

‘హిట్2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మీనాక్షి చౌదరి

‘ఖిలాడి’ చిత్రంలో రవితేజకి జంటగా నటించి ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం   వరుస అవకాశాలు అందుకుంటోంది. త్వరలోనే ‘హిట్2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. శేష్ ఇందులో కృష్ణదేవ్ అలియాస్ కె.డి.గా కనిపించనున్నట్టు చెప్పిన టీమ్.. నిన్న మీనాక్షి పాత్రను పరిచయం చేసింది. ఇందులో ఆమె ఆర్య అనే క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ పోషిస్తోందని చెప్పడంతో పాటు రేపు టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

భానుచందర్ , రావు రమేష్​, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నాని సమర్పణలో ప్రశాంతి  నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2న సినిమా విడుదల కానుంది. మరోవైపు మీనాక్షి వరుస క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్  ‘సాలార్’తో  పాటు మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలోనూ aఈమె సెకెండ్ లీడ్‌‌‌‌గా నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.