
ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary). అక్కినేని హీరో సుశాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా పరవాలేదు అనిపించింది. అయినప్పటికి.. మీనాక్షితెలుగులో మంచి అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత మాస్ మహారాజ రవితేజతో ఖిలాడీ సినిమా చేసి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమాలో లిప్ లాక్స్, గ్లామర్ షోతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా తరువాత వచ్చిన హిట్ 2 మూవీ మీనాక్షి కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది మీనాక్షి.మహేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ గుంటూరు కారంలో నటించి మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం మీనాక్షి తమిళ సూపర్ స్టార్ విజయ్ కి జోడీగా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, మట్కా, లక్కీ భాస్కర్, మోకానిక్ రాకీ సినిమాల్లో నటిస్తుంది.
ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న మీనాక్షి చౌదరి..అక్కడే థాయ్ బాక్సింగ్ నేర్చుకుంది. లేటెస్ట్ గా ఈ బాక్సింగ్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అయితే, 'GOAT' నెక్స్ట్ షెడ్యూల్‌కు ముందు మీనాక్షి చౌదరి ఈ బాక్సింగ్ సెషన్ లో పాల్గొన్నట్లు సమాచారం.
Also Read: సుహాస్ ఓ భామ అయ్యో రామ..ఉదయ్ కిరణ్ హీరోయిన్ రీ ఎంట్రీ
విజయ్ తో తెరకెక్కే ఈ సినిమాలో నెక్స్ట్ షెడ్యూల్ యాక్షన్ సన్నివేశాలని కలిగి వుందని తెలుస్తోంది. అయితే, ఇది సాధారణ శిక్షణా లేక ఆమె స్క్రీన్‌పై యాక్షన్ సీక్వెన్స్‌తో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతుందా అనేది తెలియాల్సి ఉంది.