V6 News

Netflix Series: సిద్దు జొన్నలగడ్డతో నెట్‌ఫ్లిక్స్ భారీ వెబ్ సిరీస్.. హీరోయిన్‌గా మీనాక్షి ఫిక్స్..!

Netflix Series: సిద్దు జొన్నలగడ్డతో నెట్‌ఫ్లిక్స్ భారీ వెబ్ సిరీస్.. హీరోయిన్‌గా మీనాక్షి ఫిక్స్..!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ఫ్లిక్స్, టాలీవుడ్ బడా బ్యానర్ సితార ఎంటర్టైన్ మెంట్స్తో కలిసి ఓ భారీ తెలుగు వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో స్టార్ భాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా, వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. నిర్మాతగా నాగవంశీ వ్యవహరిస్తున్నారు.

ఈ సిరీస్‌లో సెన్సేషన్ బ్యూటీ మీనాక్షిచౌదరి హీరోయిన్‌గా ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది. బ్లాక్‌బస్టర్ ఫామ్‌లో ఉన్న మీనాక్షి, వెంకీ అట్లూరి ఇద్దరికీ ఇది డిజిటల్ డెబ్యూ కావడం విశేషం. నిర్మాత నాగవంశీకి కూడా ఓటీటీ రంగంలో ఇది తొలి ప్రాజెక్ట్.

భారీ బడ్జెట్‌తో, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే టైటిల్, ఇతర నటీనటులపై అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

►ALSO READ | కేజీఎఫ్ 3పై క్లారిటీ ఇచ్చిన యష్.. రాఖీ భాయ్ రీ-ఎంట్రీకి ఎప్పుడంటే?

వెంకీ అట్లూరి మేకింగ్..  

ఇప్పటివరకు ‘తొలిప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి క్లాస్ సినిమాలతో గుర్తింపు పొందిన వెంకీ అట్లూరి, ఈ సిరీస్‌తో డిజిటల్ ప్రపంచంలో తన కొత్త మేకింగ్ స్టైల్‌ను చూపించనున్నారని టాక్. ప్రస్తుతం ఆయన సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రాజెక్ట్‌ పూర్తి చేసే పనిలో ఉన్నారు. 

సిద్ధు ‘గ్యాంగ్ స్టార్స్’సిరీస్‌..

ఇక  సిద్దు జొన్నలగడ్డ గతంలో ‘గ్యాంగ్ స్టార్స్’ వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ క్రైమ్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రైమ్ డ్రామా సిరీస్‌లో జగపతి బాబు, నవదీప్ కీలకపాత్రలు పోషించారు.