- పార్టీ మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరనున్న కాంగ్రెస్వ్యవహారాల ఇన్‌చార్జి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ శుక్రవారం భేటీ కానున్నారు. గురువారం హైదరాబాద్ చేరుకున్న ఆమె.. జీవన్ రెడ్డిని కలిసి పార్టీ మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
నాలుగు రోజులుగా ఆయన పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ పరంగా తగిన న్యాయం చేస్తామని ఆమె హామీ ఇవ్వనున్నట్లు సమాచారం.
