ముద్దు సీన్లకు ఓకే కానీ, కండీషన్స్ అప్లై అంటున్న మీనాక్షి

ముద్దు సీన్లకు ఓకే కానీ, కండీషన్స్ అప్లై అంటున్న మీనాక్షి

సౌత్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆతరువాత హిట్ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. గ్లామర్ షోకు ఏమాత్రం వెనుకాడని మీనాక్షి.. ఆ తరువాత మంచి అవకాశాలు వస్తాయని ఆశించింది. కానీ, అలా జరుగలేదు. తరువాతి ఆఫర్ కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. రవితేజ తో ఖిలాడీ సినిమా చేశాక మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. 

ఇటీవల మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించిన మీనాక్షి చేతిలో ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. వాటిలో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న సినిమా ఉందని సమాచారం. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి, వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న GOAT సినిమాలో హీరోయినిగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

ఇక ఇటీవలే మీనాక్షి నటించిన గుంటూరు కారం సూపర్ సక్సెస్ ఐన సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు మీనాక్షి.. మహేశ్ బాబు సరసన నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటి రోజు ఆయనతో నటించడానికి కాస్త  కంగారు పడ్డాను. కానీ, ఆయన ఇంకాస్తా సమయం ఇచ్చారు. ధైర్యం చెప్పారు. ఇక నేను చేస్తున్న సినిమాల విషయంలో, మరీ ముఖ్యంగా ముద్దు సీన్ల విషయంలో కొన్ని నియమాలు పెట్టుకున్నా. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ముద్దు సీన్లు చేయడానికి సిద్ధమే కానీ, అసభ్యకరంగా ఉండకూడదు.. అని చెప్పుకొచ్చారు మీనాక్షి.