తక్కువ ధరకే మీషో IPO.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. పోటీ ఉన్నా తగ్గని జోష్..!

తక్కువ ధరకే మీషో IPO.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. పోటీ ఉన్నా తగ్గని జోష్..!

ఈ కామర్స్ కంపెనీ మీషో  స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతుండగా.. మీషో  స్టాక్ ధరను తెలివిగా నిర్ణయించిందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో కొన్ని కొత్త జనరేషన్ టెక్ కంపెనీలు చేసినట్లుగా  షేర్ ధర ఎక్కువగా కాకుండా... ఒక్కో షేరుకు రూ.105 నుండి రూ.111గా నిర్ణయించింది. అయితే ఈ IPO ద్వారా రూ.5,421 కోట్లు సమీకరించాలని చూస్తుంది. 

మీషో సెప్టెంబర్ 2021లో నిధులు సేకరించినప్పుడు దాని విలువ  490 కోట్లు అంటే ఇప్పుడు IPO విలువ దాదాపు 580 కోట్లు, ఇది కేవలం 19% ప్రీమియం మాత్రమే. గత టెక్ కంపెనీల లిస్టింగ్‌లతో పోలిస్తే ఇది చాలా తక్కువ.  

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మీషోను Zomato, Nykaa, లేదా Mamaearth వంటి ఇతర కొత్త టెక్ కంపెనీలతో మిషోని పోల్చడం కొంచెం కష్టం. ఎందుకంటే మీషోకు భారీగా కస్టమర్‌లు ఉన్నారు. ఒక్కో ఆర్డర్ విలువ (AOV) చాలా తక్కువగా ఉన్న ఎక్కువ ఆస్తులు లేకుండా  వ్యాపారం చేస్తుంది.

 గత 12 నెలల్లో మీషో 701.6 బిలియన్ల విలువైన వస్తువులను (GMV) విక్రయించింది. కానీ లిస్ట్ అయిన కంపెనీలు GMV కాకుండా ఆదాయం (Revenue) చెబుతాయి, కాబట్టి పోల్చడం  కష్టం. FY25లో మీషో ఆదాయం  5 వేల 735 కోట్లు. ఇది వస్తువుల మొత్తం విలువ కాదు, కేవలం కమీషన్ల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రమే.

విక్రేతల(sellers) సంఖ్య 7,06,471కి పెరిగింది. అయితే ఒక్కో విక్రేతకు వచ్చే ఆవరేజ్ ఆర్డర్లు తగ్గాయి, అంటే మార్కెట్లో పోటీ పెరుగుతోంది అని అర్థం.

►ALSO READ | భారత ఈవీ కార్ల మార్కెట్లో చైనా హవా.. ఆ మూడు కంపెనీల చేతిలోనే 33 శాతం బిజినెస్

పోటీ ఉన్నప్పటికీ, మీషో  వ్యాపార ఖర్చులను మెరుగుపరుచుకుంది. కాంట్రిబ్యూషన్ మార్జిన్ (లాభం) FY23లో 2.9% నుండి FY25లో 4.95%కి పెరిగింది. FY24లో 304 కోట్ల తర్వాత.. కంపెనీ FY25లో  351 కోట్ల నగదు ప్రవాహాన్ని సృష్టించింది. 

 FY25లో 460 కోట్ల నష్టం ఉన్న ఇందులో వ్యాపారనికి  సంబంధించిన  743 కోట్ల వన్ టైం ట్యాక్స్ కాస్ట్  ఉంది. ఈ ఖర్చును తీసివేస్తే, మీషో  దాదాపు  283 కోట్ల లాభంతో ఉండేది. ఖర్చుల నిర్వహణ, మంచి నగదు ప్రవాహం కారణంగా మీషో లాభాల దిశగా పయనిస్తుందని నమ్ముతున్నాము అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మీషో గురించి విశ్లేషకులకు ఉన్న కొన్ని  సమస్యలు చూస్తే క్యాష్-ఆన్-డెలివరీ (COD) పై ఎక్కువ ఆధారపడటం.

మీషో IPO ధరను తెలివిగా నిర్ణయించి ఇతర టెక్ కంపెనీలలాగ హంగామా పెట్టలేదు. షేర్ ధర ఇత్తర టెక్ కంపెనీ లిస్టింగ్‌ల ఎంట్రీ  కంటే తక్కువగా ఉంది. దీనివల్ల పెట్టుబడిదారులకు లాభం వచ్చే అవకాశం ఉంది, నష్టల భయం (Risk) కూడా తక్కువ  ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా, మీషో లాభాల దిశగా అడుగులు వేస్తుండటం, తక్కువ ధరతో వస్తున్న ఈ IPO పెట్టుబడిదారులకు  మంచి అవకాశం అని విశ్లేషకులు భావిస్తున్నారు.