జమ్మూ కాశ్మీర్ ఉగ్రకుట్ర భగ్నం వెనుక మాస్టర్ బ్రెయిన్... మన తెలుగు ఆఫీసరే.. !

జమ్మూ కాశ్మీర్ ఉగ్రకుట్ర భగ్నం వెనుక మాస్టర్ బ్రెయిన్... మన తెలుగు ఆఫీసరే.. !

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు జరిపి.. ఢిల్లీ లక్ష్యంగా టెర్రరిస్ట్ మాడ్యూల్ వేసిన బిగ్ స్కెచ్ ను భగ్నం చేసింది. ఐదు దశల్లో దేశవ్యాప్తంగా టెర్రరిస్ట్ మాడ్యూల్ కార్యాచరణ అమలు చేసేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించింది ప్రభుత్వం. ఈ ఉగ్రకుట్ర భగ్నం వెనుక మాస్టర్ బ్రెయిన్ మన తెలుగు ఆఫీసరే.. ఈ కేసుకు సంబంధించి మొదట లీడ్ ఇచ్చింది కర్నూలుకు చెందిన సందీప్ చక్రవర్తి అని సమాచారం. సందీప్ చక్రవర్తి ప్రస్తుతం శ్రీనగర్ SSPగా ఉన్నారు.

పహల్గాం ఎటాక్ తర్వాత చేపట్టిన మహదేవ్ ఆపరేషన్ లోనూ సందీప్ చక్రవర్తి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. జైషే మహమ్మద్ పోస్టర్లను మొదట గుర్తించిన సందీప్.. పోస్టర్లు అంటించిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ముగ్గురు నిందితులపై గతంలో స్టోన్ పెల్టింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించిన సందీప్ అండ్ టీం.. సోఫియాన్, ఇర్ఫాన్ అహ్మద్ లను అరెస్ట్ చేసి రెండు వారాల పాటు విచారించారు.వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే డాక్టర్ల టెర్రర్ ప్లాట్ బయటికి వచ్చింది.

ఈ క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు డాక్టర్స్ టెర్రర్ మాడ్యుల్ లో ఇప్పటిదాకా తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్ తనిఖీల్లో 358 కేజీ పేలుడు పదార్థంతోపాటు 2563 కేజీల సామాగ్రిని స్వాధీనం చేసుకున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు..రెండు సంవత్సరాలుగా ఈ సామాగ్రిని సమకూర్చినట్లు గుర్తించారు.