బడ్జెట్ ట్రావెలర్‌.. ట్రావెలింగ్ కోరిక ఉండి, పెద్దగా డబ్బులేని వాళ్లకు ఇతనో ఇన్‌స్పిరేషన్‌

బడ్జెట్ ట్రావెలర్‌.. ట్రావెలింగ్ కోరిక ఉండి, పెద్దగా డబ్బులేని వాళ్లకు ఇతనో ఇన్‌స్పిరేషన్‌

ట్రావెలింగ్‌ అంటే ఇష్టం. కానీ.. కావాల్సినంత డబ్బు లేదు. దాంతో ఆ కోరిక కలగానే మిగిలిపోయింది. అనుకోకుండా ఒకరోజు యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక ట్రావెలింగ్ వీడియో చూశాడు. దానివల్ల అతనికి డబ్బు లేకున్నా దేశవిదేశాలు ఎలా తిరగాలో తెలిసింది. వెంటనే చదువుకు ఫుల్‌ స్టాప్‌ పెట్టి, భుజాన బ్యాగ్‌ తగిలించుకుని ప్రపంచాన్ని చుట్టేందుకు బయల్దేరాడు దీపాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంగ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అప్పటినుంచి ‘బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రావెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ గురించి చెప్తూ ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచాడు.

దీపాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంగ్వాన్ 1993 నవంబర్ 10న హర్యానాలోని చార్కిదాద్రిలో పుట్టాడు. ఆ తర్వాత వాళ్ల కుటుంబం కొంతకాలం ఢిల్లీ, ముంబై, బికనీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. ప్రస్తుతం చండీగఢ్​లో ఉంటున్నారు. దీపాన్ష్​కి చిన్నప్పటినుంచి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ కొత్త ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు వెళ్లాలని, ప్రపంచాన్ని అన్వేషించాలని కలలు కనేవాడు. కానీ.. అందుకు కావాల్సినంత డబ్బు లేక ఆగిపోయాడు. ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత నోయిడాలోని శారదా యూనివర్సిటీలో చేరి మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత క్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టాడు.

అయితే.. ట్రావెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదున్న ఇష్టంతో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో ట్రావెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్లాగ్స్ చూసేవాడు. అలా ఒకరోజు ‘జీరో బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ట్రావెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’పై వచ్చిన ఒక వీడియో చూశాడు. ఆ వీడియోతో అతని ఆలోచన పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు ట్రావెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి బాగా డబ్బు కావాలి అనుకునేవాడు. కానీ.. ఆ వీడియో ద్వారా చాలా తక్కువ డబ్బుతో ఎలా ట్రావెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలో తెలుసుకున్నాడు. అందుకే భవిష్యత్తు, పై చదువులు అన్నీ పక్కన పెట్టి ట్రావెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం వల్లే  ఒక సాధారణ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రావెలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

తక్కువ ఖర్చుతో.. 
దీపాన్ష్​ ఇప్పటివరకు ఎన్నో దేశాలు తిరిగాడు. కానీ.. ఎక్కడా లగ్జరీగా ఖర్చు పెట్టలేదు. చాలా తక్కువ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ట్రావెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటాడు. ఎక్కువగా కౌచ్ సర్ఫింగ్ (ట్రావెలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వసతి సౌకర్యం కల్పించే కమ్యూనిటీ) మీదే ఆధారపడతాడు. లేదంటే తక్కువ ఫీజులు వసూలు చేసే హాస్టళ్లు, డార్మెటరీల్లో ఉంటాడు. అంతేకాదు.. ఇప్పటివరకు హిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హైకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అంటే లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా 50,000 కి.మీ.లకు పైగా ప్రయాణించాడు. దీపాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు హిందీ, పంజాబీ, ఉర్దూ భాషలు బాగా తెలుసు. ఇప్పుడు మరాఠీ, స్పానిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా నేర్చుకుంటున్నాడు. కాబట్టి ఎక్కడికి వెళ్లినా అతనికి భాషాపరమైన ఇబ్బందులు రాలేదు.

18 లక్షల మంది
దీపాన్ష్‌ చానెల్ పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా వ్లాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. వాటిలో 70 లక్షల వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాటిన వీడియోలు కూడా ఉన్నాయి. చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రస్తుతం 18.4 లక్షల మంది సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లు ఉన్నారు. చానెల్ ద్వారా అతను నెలకు రూ. 50 వేల నుంచి రూ. 75 వేల వరకు సంపాదిస్తున్నాడు. దీంతోపాటు అడ్వర్టైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు, స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా కొంత ఆదాయం వస్తోంది. 

చాలా సింపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
దీపాన్ష్‌ చేసే వీడియోలు కూడా చాలా సింపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. ఎక్కడికి వెళ్లినా అక్కడివాళ్లతో కలిసిపోయి మాట్లాడతాడు. కొత్త సంస్కృతుల గురించి తెలుసుకుంటాడు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో మమేకమై వాళ్ల జీవన విధానాన్ని చూపించాడు. కనిపించిన ప్రతి విషయాన్ని వీడియో తీస్తాడు. ఇతర ట్రావెల్ వ్లాగర్లలా సినిమాటిక్ షాట్లలాంటివి  తీయడు. కానీ.. ఎక్కడికెళ్లినా ప్రజలు అప్పటివరకు చూడని ఏదో ఒక కొత్త విషయాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా ప్రకృతి అందాలను ఒడిసిపట్టేందుకు ప్రయత్నిస్తాడు. 

ప్రయాణం.. ఇలా మొదలైంది!
దీపాన్ష్‌ 2017లో ‘నోమ్యాడిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియన్’ పేరుతో యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చానెల్ పెట్టాడు. ఒక ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని, పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఒప్పించి 105 రోజుల థాయిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి బయలుదేరాడు. తన ప్రయాణంలో ఎదురయ్యే వింతలు, విశేషాలను వీడియోలు తీసి యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ‘‘యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫేమస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా లక్ష్యం ట్రావెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడమే. కానీ.. అందుకోసం డబ్బు కావాలి. కాబట్టి యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టా” అంటున్నాడు దీపాన్ష్​.

ఇన్‌స్పిరేషన్‌‌
దీపాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేవలం ట్రావెలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే కాదు.. ఎంతోమందికి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పిరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలుస్తున్నాడు. ట్రావెలింగ్ చేయాలనే కోరిక ఉండి, పెద్దగా డబ్బులేని వాళ్లకు తక్కువ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎలా ట్రావెలింగ్ చేయాలో తన వీడియోల ద్వారా చెప్తున్నాడు. ‘‘ప్రయాణం అంటే ఖర్చు చేయడం మాత్రమే కాదు.. అనుభవాలు” అని చెప్పే అతని మాటలు విని ఎంతోమంది సోలో ట్రావెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టారు. దీపాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పిన టిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల ఒక యువకుడు శ్రీలంక ట్రిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15,000 రూపాయలు ఆదా చేసినట్లు సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా ద్వారా పంచుకున్నాడు.