
హైదరాబాద్, వెలుగు: గోదావరి, కావేరి అనుసంధానంపై ఈ నెల 9న నేషనల్ వాటర్ డెవలప్మెంట్అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశం కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ భేటీలో అనుసంధాన ప్రాజెక్ట్‌పై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను చర్చించనున్నారు. అంశాల వారీగా రాష్ట్ర అధికారుల నుంచి ఎన్‌డబ్ల్యూడీఏ అభిప్రాయాలను తీసుకోనుంది. ప్రధానంగా నదుల అనుసంధానంలో ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణాన్ని సర్కారు వ్యతిరేకిస్తున్నది.
ఇచ్చంపల్లి వద్ద కడితే దిగువన 24 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న తుపాకులగూడెం బ్యారేజీకి ఆకస్మికంగా వచ్చే వరదను నియంత్రించడం కష్టమవుతుందని చెప్తున్నది. రాష్ట్రం ఇప్పటికే పలు అభ్యంతరాలను ఎన్‌డబ్ల్యూడీఏ ముందు వ్యక్తం చేసింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో వాటాలు తేలే వరకు నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించరాదని కోరుతున్నది.