
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ కార్యదర్శుల సమస్యలన్నింటికీ న్యాయమైన పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క తెలిపారు. పంచాయతీ కార్యదర్శులతో త్వరలో సమావేశం నిర్వహించి అన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
శనివారం ప్రజాభవన్‌లో తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు మంత్రి సీతక్కతో సమావేశమయ్యారు. తమకు రూ.104 కోట్ల బిల్లులు విడుదల చేయడం, డిప్యుటేషన్లకు అనుమతి ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్నందుకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యులు సీతక్కకు పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.