
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రీసెంట్‌గా ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టారు. హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. మొదటి రోజు చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. చిరంజీవి నటిస్తున్న 157వ సినిమా ఇది. ఇందులో ఆయన వింటేజ్ లుక్‌లో కనిపించనున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక తన మార్క్ యూనిక్ ప్రమోషన్స్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన అనిల్ రావిపూడి.. చిరు సినిమా విషయంలోనూ అదే జోష్ చూపిస్తున్నాడు. టెక్నికల్ క్రూను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోతో పాటు ఇటీవల నయన్‌పై చిత్రీకరించి విడుదల చేసిన స్పెషల్ వీడియోకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.