Alia Bhatt Cannes: కేన్స్ రెడ్ కార్పెట్‌పై అలియా భట్ అరంగేట్రం.. ఫోటోలు వైరల్

Alia Bhatt Cannes: కేన్స్ రెడ్ కార్పెట్‌పై అలియా భట్ అరంగేట్రం.. ఫోటోలు వైరల్

78వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఫ్రాన్స్లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. మే 13 నుంచి 24 వరకూ.. అంటే నేటివరకు ఈ కేన్స్‌ ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే, ఇండియన్ తారలు ఎంతోమంది ఈ ఫెస్టివల్లో తళుక్కుమని మెరిశారు.

అయితే, ఈ ఈవెంట్లో బాలీవుడ్ బ్యూటీ అలియా వెళ్లకపోవడంపై ఆమె ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలో అలియా భట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది. లేటెస్ట్గా కేన్స్లో అడుగుపెట్టానంటూ అలియా పోస్ట్ చేసింది. సింపుల్‌ ఎంబ్రాయిడరీ వర్క్‌ చేసిన ఫ్లోరల్ గౌన్‌తో నాజూగ్గా కనిపించి అట్ట్రాక్ట్ చేసింది.

ఈ సందర్భంగా ‘హలో కేన్స్‌’అంటూ తన ఫోటోలను షేర్ చేసింది. రెడ్‌ కార్పెట్‌పై అరంగేట్రం చేయడానికి ముందు తన షేర్ చేసిన ఫొటోలతోనే జోష్ నింపింది. ఆ తర్వాత కాసేపటికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యి ఆకట్టుకుంది. 32 ఏళ్ల ఈ నటి ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవంలో తన రెడ్ కార్పెట్పై అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఆలియా 'బ్యూటీ బ్రాండ్ లోరియల్ పారిస్కు' ప్రపంచ రాయబారిగా ఉంది, ఇది గాలాలో 28వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.ఇక తొలిరోజే (మే 13న) అలియా వెళ్తారని అందరూ భావించారు. అయితే భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. 

మే23న సడెన్గా ముంబై ఎయిర్ పోర్టులో అలియా కనిపించింది. అంతేకాదు. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలోనూ రాసుకొచ్చింది. లేత గోధుమరంగు కోటు, వైట్ స్నీకర్స్, బ్లాక్ హ్యాండ్బ్యాగ్, డార్క్ సన్ గ్లాసెస్లో ముంబై విమానాశ్రయంలో కనిపించి అదరగొట్టింది. దీంతో ఆమె అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఎదురుచూస్తున్న రాణి ఇక్కడ ఉంది అంటూ ఓ అభిమాని రాసుకొచ్చాడు. 

ప్రస్తుతం అలియా సినిమాల విషయానికొస్తే.. చివరిసారిగా వాసన్ బాల తెరకెక్కించిన జిగ్రాలో నటించింది. ఆకాంక్ష రంజన్ కపూర్, వేదంగ్ రైనాతో కనిపించింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్నాలీ దర్శకత్వంలో వస్తున్న 'లవ్ & వార్' సినిమాలో విక్కీ కౌశల్, రణభీర్ కపూర్తో కలిసి నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 20న విడుదల కానుంది.