నల్లమల అడవుల్లో కెమెరాకు చిక్కిన అరుదైన అడవి దున్న.. 150 ఏళ్ల తర్వాత మళ్లీ..

నల్లమల అడవుల్లో కెమెరాకు చిక్కిన అరుదైన అడవి దున్న.. 150 ఏళ్ల తర్వాత మళ్లీ..

Adavi Dunna: అనేక దశాబ్ధాలుగా కొనసాగుతున్న నగరీకరణతో అటవీ భూములు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో అనేక అరుదైన వన్య ప్రాణులు, పక్షులు అంతరించిపోవటంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో అరుదైన అడవి దున్నలను గుర్తించారు. ఆత్మకూరు డివిజన్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఇండియన్ బైసన్ అని పిలువబడే అడవి దున్న కెమెరాకు చిక్కింది. బైర్లౌటి ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో చిక్కిన చిత్రాలు బయటకు వచ్చాయి. దాదాపు 150 ఏళ్ల తర్వాత మళ్లీ వీటి గుర్తించటంపై పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా అంతరించిపోయాయి అనుకున్న ఈ జాతి జంతువులను తిరిగి ఇప్పుడు నల్లమల అడవుల్లో తిరిగి గుర్తించబడ్డాయి.

ALSO READ | మహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లాలో ఎన్​ కౌంటర్​.. నలుగురు మావోయిస్టులు మృతి