నారాయణపేట జిల్లా కోర్టులో ఉద్యోగాలు .. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ట్రై చేయొచ్చు..!

నారాయణపేట జిల్లా కోర్టులో ఉద్యోగాలు .. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ట్రై చేయొచ్చు..!

నారాయణపేట జిల్లా కోర్టులో కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

  • పోస్టులు: కోర్ట్ అసిస్టెంట్ 01, కోర్ట్ అటెండెంట్ 01. 
  • ఎలిజిబిలిటీ: కోర్ట్ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్మీడియట్, కోర్ట్ అటెండెంట్ పోస్టుకు ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • వయోపరిమితి: 18 నుంచి 34 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి, నారాయణపేట చిరునామాకు పంపించాలి. 
  • అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 04.
  • లాస్ట్ డేట్: సెప్టెంబర్ 15.  
  • సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్​లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్ చేస్తారు.