బీహెచ్ఈఎల్లో ఇంజినీర్ పోస్టులు.. పోస్టులు తక్కువే కానీ.. జాబ్ లొకేషన్ హైదరాబాద్

బీహెచ్ఈఎల్లో ఇంజినీర్ పోస్టులు.. పోస్టులు తక్కువే కానీ.. జాబ్ లొకేషన్ హైదరాబాద్

హైదరాబాద్లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్, సూపర్​వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 28.

  • పోస్టుల సంఖ్య: 12
  • పోస్టులు: ఇంజినీర్(ఎఫ్టీఏ– మెకానికల్) 02, ఇంజినీర్ (ఎఫ్టీఏ– ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్) 01, సూపర్​వైజర్(ఎఫ్​టీఏ– మెకానికల్) 06, సూపర్​వైజర్ (ఎఫ్​టీఏ– ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్) 03. 
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్ లేదా బీఈ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 07. 
  • లాస్ట్ డేట్: ఆగస్టు 28. 
  • అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్​డ్. ఓబీసీ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. 
  • సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు careers.bhel.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

►ALSO READ | నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : పది పాసైతే చాలు.. హైదరాబాద్ లో మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు..