నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : పది పాసైతే చాలు.. హైదరాబాద్ లో మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ :  పది పాసైతే చాలు..  హైదరాబాద్ లో మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు..
  • ఐఐసీటీలో మల్టీటాస్కింగ్ ఆఫీసర్ పోస్టులు  

హైదరాబాద్​లోని సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్ ఐఐసీటీ) స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టుల సంఖ్య: 09(జూనియర్ స్టెనోగ్రాఫర్ 01, మల్టీ టాస్కింగ్ స్టాఫ్​ 08) 

ఎలిజిబిలిటీ: జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు ఇంటర్మీడియట్​తోపాటు ఇంగ్లిష్/ హిందీ భాషల్లో స్టెనోగ్రాఫీ నైపుణ్యం కలిగి ఉండాలి. మల్టీటాస్కింగ్ పోస్టుకు మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: జూనియర్ స్టెనోగ్రాఫర్​కు 25 ఏండ్లు, మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టుకు 27 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 12.  

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, సీఎస్ఐఆర్ ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500.

సెలెక్షన్ ప్రాసెస్: జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టు కంప్యూటర్ బేస్డ్ టెస్టుతోపాటు స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం పరీక్షిస్తారు. మల్టీ టాస్కింగ్ పోస్టుకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  www.iict.res.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

ఎగ్జామ్ ప్యాటర్న్ 

జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్​లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్–1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, జనరల్ అవేర్​నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలు 100 మార్కులకు మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. సీబీటీ ఎగ్జామ్ పూర్తికాగానే స్టెనోగ్రఫీ ప్రావీణ్యంపై ఎగ్జామ్ ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే.  

►ALSO READ | Job News: ESIC లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

మల్టిటాస్కింగ్ స్టాఫ్​  కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్​లో మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు 75 మార్కులకు, జనరల్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 75 మార్కులకు, జనరల్ అవేర్ నెస్ 50 ప్రశ్నలు 150 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు 150 మార్కులకు మొత్తం 450 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.