ఫైవ్ స్టార్ హోటల్లో రూం బుక్ చేస్తా.. వస్తావా అని వేధిస్తున్నాడు: ఎమ్మెల్యేపై రోడ్డెక్కిన సినీ నటి !

ఫైవ్ స్టార్ హోటల్లో రూం బుక్ చేస్తా.. వస్తావా అని వేధిస్తున్నాడు: ఎమ్మెల్యేపై రోడ్డెక్కిన సినీ నటి !

మలయాళం మూవీ ఇండస్ట్రీ రోజురోజుకు ఎంతలా అభివృద్ధి చెందుతుంది అన్నది కాదు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోన్నారు ? ఎలాంటి లైంగిక వేధింపులకు గురువుతున్నారు? అనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

లేటెస్ట్గా మరో మలయాళ నటి రిని జార్జ్ (Rini George) తాను చిక్కుకున్న వలలో నుంచి బయటకొచ్చింది. ఓ యువ ఎమ్మెల్యే తనను ఫైవ్ స్టార్ హోటల్‌కు రమ్ముంటున్నాడని.. అభ్యంతరకరమైన మెసేజ్లు పంపిస్తూ వేధిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఆ నాయకుడు తనను హోటల్‌లో గదికి రమ్మంటున్నాడని, ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఆ సదరు పార్టీ అధికారులు చర్యలు తీసుకోలేదని నటి ఆరోపించింది.

ఇపుడు ఈ నటి రిని జార్జ్ ఆరోపణలు సినీ పరిశ్రమలోనే కాదు, రాజకీయాల్లోను తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే, ఆ ఎమ్మెల్యే పేరుగానీ, అతని పార్టీ ఏంటనేది మాత్రం నటి రిని జార్జ్ వెల్లడించలేదు. ‘సోషల్ మీడియా ద్వారా నేను ఆ రాజకీయ నాయకుడిని కలిశాను. మూడేళ్ల క్రితం నాకు అతని నుండి అభ్యంతరకరమైన మెసేజ్లు వచ్చాయి. అలా వచ్చినప్పటి నుండి, అతని అనుచిత ప్రవర్తన ఇంకా ఎక్కువైందని’ జార్జ్ చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా, సంబంధిత పార్టీ సీనియర్ నాయకులకు తన ఫిర్యాదు చేసినప్పటికీ, పట్టించుకోలేదని తెలిపింది. కానీ, ఆ యువ నాయకుడికి మాత్రం పార్టీలో ప్రముఖ పదవులు లభిస్తూనే ఉన్నాయని నటి రిని జార్జ్ అన్నారు. అంతేకాకుండా "నువ్వు వెళ్లి ఎవరికైనా చెప్పుకో.. ఎవరు పట్టించుకుంటారు?" అని అతడు చెప్పినట్లు కూడా తెలిపింది.

ప్రస్తుతం నటి రిని జార్జ్ చేసిన ఆరోపణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే మలయాళ సినీ పరిశ్రమ పెద్దలు, ఆ సదరు పార్టీ హైకమాండ్.. 'యువ నాయకుడి'పై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనేది తెలియాల్సి ఉంది. అలాగే, ఇటీవలే అమ్మ ప్రెసిడెంట్గా ఎన్నికైన 'శ్వేతా మీనన్' సైతం ఎలా రియాక్ట్ అవుతుంనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది. 

గతేడాదే మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదల చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నో రాజకీయ ప్రకంపనలు కూడా రేపింది. ఎంతోమంది మీడియా ముందుకొచ్చి తమ భాధలు చెప్పుకున్నారు. రిటైర్డ్ హైకోర్టు జ‌డ్జి కే హేమా..ఆ క‌మీష‌న్‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. న‌టి శార‌దతో పాటు మాజీ సివిల్ స‌ర్వీస్ అఫిషియ‌ల్ కేబీ వాత్సల కుమారి ఆ క‌మీష‌న్‌లో స‌భ్యులుగా ఉన్నారు.