
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు బురిడీ కొట్టించారు. తప్పుడు బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఇచ్చి కొందరు కానిస్టేబుల్స్ ఉద్యోగంలో చేరినట్లు తేలింది. తప్పుడు బోనఫైడ్ సర్టిఫికెట్లు ఇచ్చిన 59 మందిపై పోలీస్ శాఖ ఫిర్యాదు చేసింది. ఈ 59 మంది కానిస్టేబుల్స్ ఇప్పటికే AR , సివిల్ కానిస్టేబుల్స్గా విధుల్లో కొనసాగుతున్నారు. 59 మంది నకిలీ పత్రాలపై తెలంగాణ పోలీసు శాఖ సీసీఎస్లో ఫిర్యాదు చేసింది.
జాతీయ స్థాయిలో అత్యుత్తమ పోలీసింగ్ నిర్వహిస్తున్న కేటగిరీలో మొదటి స్థానంలో రాష్ట్ర పోలీస్ శాఖ నిలిచింది. ఇలాంటి మంచి పేరుతో ముందుకెళుతున్న తెలంగాణ పోలీస్ శాఖను బురిడీ కొట్టించి.. పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేలా తప్పుడు బోనఫైడ్ సర్టిఫికెట్స్తో ఉద్యోగంలో చేరిన కానిస్టేబుల్స్ పై కఠిన చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమైంది. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ నంబర్ వన్ స్థానం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
►ALSO RAED | పన్ను రేట్ల తగ్గింపు ప్రతిపాదనను స్వాగతిస్తున్నం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఇండియా జస్టిస్ రిపోర్ట్–2025 ర్యాంకింగ్స్లో 10 పాయింట్లకు గాను 6.48 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించింది. ఏపీ 6.44 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, 3.36 పాయింట్లతో వెస్ట్ బెంగాల్ చివరి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల పోలీస్ శాఖలకు ర్యాంకింగ్స్ కేటాయించిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ –2025 విడుదలైంది. పోలీస్, న్యాయ వ్యవస్థ, జైళ్ల శాఖ, లీగల్ ఎయిడ్ సహా మొత్తం 32 అంశాలకు సంబంధించి10 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన తెలంగాణ, ఏపీ సహా18 పెద్ద రాష్ట్రాలు, 10 మిలియన్ల లోపు జనాభా గల సిక్కిం సహా 7 చిన్న రాష్ట్రాల్లో సర్వే చేసి ర్యాంకింగ్స్ విడుదల చేశారు.