అకాల వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది..హైకోర్టులో కేసీఆర్ లాయర్ వాదనలు

అకాల వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది..హైకోర్టులో కేసీఆర్ లాయర్  వాదనలు

అకాల వర్షాల కారణంగానే మేడిగడ్డ పిల్లర్ కుంగిందని కేసీఆర్ తరపు లాయర్ సుందరం శేషాద్రి నాయుడు హైకోర్టుకు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును కొట్టేయాలని  హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావు  పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే..ఈ పిటిషన్ లను  ఆగస్టు 21న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ బెంచ్  విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా కేసీఆర్ తరపున  సుప్రీంకోర్టు న్యాయవాది  సుందరం, పీసీ ఘోష్ కమిషన్ తరపున ఏజీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. 

కేసీఆర్ తరపు న్యాయవాది వాదనలు

కాళేశ్వరం అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదన్న న్యాయవాది సుందరం.. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని హై కోర్టులో వాదించారు.  నివేదికను  కేసీఆర్, హరీశ్ రావుకు అందించలేదని కోర్టుకు చెప్పారు.  పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని.. రాజకీయంగా నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారని సుందరం వాదించారు.   జస్టిస్ గోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలన్న న్యాయవాది సుందరం.. ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ ను ఆప్రతిష్టపాలు చేయాలని రాజకీయ వ్యూహంతోనే కమిషన్ నియమించారని చెప్పారు.  నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని తెలిపారు.  దురదృష్టవశాత్తు పలు  కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగిందన్నారు. వర్షాకాలంలో అకాల వర్షాల కారణంగా కూలిందని కోర్టుకు తెలిపారు.  కుంగిపోవడానికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్ తో ఎలాంటి సంబంధం లేదన్నారు.  నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు అందజేయడంలో దురుద్దేశం ఉందన్నారు న్యాయవాది సుందరం.  

►ALSO READ | పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు సుధాకర్ భార్య

 ఒకవేళ ఏదైనా ఎంక్వైరీ కమిషన్ లో వ్యక్తి పై ఆరోపణలు ఉంటే సెక్షన్ 8 బి నోటీస్ ఇవ్వాలి. కమిషన్ ఎంక్వయిరీ యాక్ట్ సెక్షన్ 8బి, 8సి నోటీసులు ఇవ్వలేదు . ఎలాంటి కాపీ తమకు ఇవ్వకుండానే జూలై 31 న ప్రభుత్వానికి వివేదిక ఇచ్చింది.. 600 పేజీల రిపోర్ట్ ను స్టడీ చేసి బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వాలని త్రీ మెన్ కమిటీ వేసింది. వాళ్ళు ఇచ్చిన 60 పేజిల రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదు. మొత్తం రిపోర్ట్ కాకుండా 60 పేజీల రిపోర్ట్ మాత్రమే అప్లోడ్ చేశారు.ప్రభుత్వ వెబ్ సైట్ లో 60 పేజీల రిపోర్ట్ ను డౌన్లోడ్ చేసుకున్నాం.దీని మీద ముఖ్యమంత్రి సహా మంత్రులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు .  దీని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. అన్ని మీడియాల్లో కమిషన్ రిపోర్ట్ ను డిస్ ప్లే కూడా చేశారు.తమకు ఎలాంటి  8బి నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఈ నివేదిక చెల్లదు.


ఈ నివేదిక ను అడ్డం పెట్టుకుని అనేక చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. కమిషన్  నివేదికతో తన క్లయింట్  మీద చర్యలు తీసుకునేలా ప్రభుత్వం వ్యవహరించవచ్చు . లీగల్ గా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.  అందుకే ఈ కమిషన్ నివేదికను పూర్తిగా కొట్టివేయాలి అని  కోరారు న్యాయవాది సుందరం.  

 కేసీఆర్ తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు..  60 పేజీల రిపోర్టును, పబ్లిక్ డొమైన్ లో పెట్టారా ?.  పిటిషనర్లకు 8బి  నోటీసులు ఇచ్చారా లేదా  ?  కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటి ? అని ఏజీని ప్రశ్నించింది. 

కమిషన్ తరపున ఏజీ నిరంజన్ రెడ్డి వాదనలు

అనంతరం కమిషన్ తరపున వాదనలు వినిపించిన ఏజీ నిరంజన్ రెడ్డి.. తాము ఇచ్చిన నోటీస్ ఏ 8బి నోటీస్ . సెక్షన్ మెన్షన్ చేయనంత మాత్రానా అది 8 బి నోటీస్ కాదని కాదు. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించాల్సిందే. కిరణ్ బేడీ కేసుకు  ఈ కేసుకు తేడాలు ఉన్నాయి . రిపోర్టును మేము ఎక్కడ పబ్లిక్ డొమెన్లో పెట్టలేదు.  అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్లో పెడతాము.  కౌంటర్లో మరిన్ని వివరాలు పొందపరుస్తాము.  ఈ స్టేజిలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దు. అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చించాక తదుపరి విచారణ చేపట్టాలి.అన్ని అంశాలను పరిశీలించే కమిషన్ విచారించింది. చర్యలు తీసుకునే అంశంపై కమిషన్ ఎలాంటి సిఫార్సు చేయలేదు. అసెంబ్లీ వేదికగా చర్చిస్తామని చెప్పడం సబబే.కమిషన్ రిపోర్ట్ పై మధ్యంతర  ఉత్తర్వులు అవసరం లేదు అని హైకోర్టుకు చెప్పారు ఏజీ.