OTT Blockbuster: థియేటర్లలోకి తెలుగు మూవీ.. ఫ్రీ టికెట్స్.. వెంటనే బుక్ చేసుకోండి!

OTT Blockbuster: థియేటర్లలోకి తెలుగు మూవీ.. ఫ్రీ టికెట్స్.. వెంటనే బుక్ చేసుకోండి!

సుమంత్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన అనగనగా (Anaganaga)మూవీ థియేటర్స్ లోకి రానుంది. మే15 నుంచి నేరుగా ‘ఈటీవీ విన్‌’ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చిన అనగనగా మూవీ బ్లాక్ బాస్టర్ అయింది. అంచనాలకు మించి వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పటికే 200 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైల్‍స్టోన్ కూడా దాటేసి సత్తా చాటుతుంది. ఈ తరుణంలో అనగనగా మేకర్స్ క్రేజీ డెసిషన్ తీసుకున్నారు.

అనగనగా మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. రేపు మే25న విజయవాడ క్యాపిటల్ సినిమాస్, వైజాగ్‍ జగదాంబ థియేటర్స్లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఇవాళ (మే24న) సాయంత్రం విజయవాడ, వైజాగ్‍ల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఇక్కడ వచ్చిన థియేటర్ ఆడియన్స్ రెస్పాన్స్ దృష్ట్యా.. రెండు తెలుగురాష్ట్రాల్లో పరిమిత థియేటర్లలో రిలీజ్ చేయాలనీ మేకర్స్ డిసైడ్ అయ్యారు.

అయితే, ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వైజాగ్‍లో నేటి షోకు 300 టికెట్లను ఫ్రీగా ఇవ్వనున్నట్టు ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు ఓ గూగుల్ ఫామ్ కూడా ట్విట్టర్ అకౌంట్‍లో పోస్ట్ చేస్తూ వెల్లడించింది. అయితే, కేవలం 300 టికెట్లే ఫ్రీగా అందుబాటులో ఉంచడంతో అవి త్వరగా ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అలోమోస్ట్ కంప్లీట్ అయ్యాయి కూడా! 

ఈ సినిమాకు చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలను దక్కించుకుంటోంది. ఇంటిల్లి పాది హాయిగా చూసుకునేలా టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్గా ఓటీటీలో రన్ అవుతోంది. దీంతో అందరూ ఈ మూవీ చూసేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా IMDBలో 8.3 రేటింగ్ సంపాదించుకుంది. 

సమాజంలో విద్య బోధనపై నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, విద్యావ్యవస్థలోని లోపాలు, విద్యా బోధనలో ఉండే వైపరీత్యాలపై సున్నితంగా సెటైర్లతో ఈ సినిమా తెరకెక్కింది. కార్పొరేట్ విద్యావ్యవస్థలోని లోపాలను కళ్ళకి కట్టినట్లుగా చూపించనట్లుగా నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెడుతున్నారు.

ముఖ్యంగా హీరో సుమంత్ యాక్టింగ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుందని చెబుతున్నారు. ప్రతి రోజూ ఓ మైలురాయిని అందుకుంటూ దూసుకెళ్తోన్న ఈ మూవీపై రోజురోజుకు బజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో థియేటర్స్ లోకి కూడా వస్తుండటంతో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇకపోతే ఈ అనగనగా సినిమాకు సన్నీ సంజయ్ దర్శకత్వం వహించారు.