కోట్లు పోసి కొన్న అపార్మెంట్స్.. వర్షం దెబ్బకు ఊడిపడ్డ కిటికీలు.. ఇవి ఇళ్లా లేక పేకమేడలా!

కోట్లు పోసి కొన్న అపార్మెంట్స్.. వర్షం దెబ్బకు ఊడిపడ్డ కిటికీలు.. ఇవి ఇళ్లా లేక పేకమేడలా!

ఇవాళ రేపు పట్టణాల్లో జాగ కరువైపోయింది. ఉన్న కాస్త స్థలంలో 50 నుంచి 60 అంతస్థుల మేడలు పుట్టుకొస్తున్నాయి. ఇక చేసేది లేక స్థోమత లేకున్నా బ్యాంక్ లోన్స్ తీసుకుని మరీ ఆకాశంలో ఇల్లు కొనుక్కోవాల్సిన పరిస్థితిలో మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. ఇక డబ్బులున్నోళ్లు లగ్జరీ ఇళ్లను సరదాకి కొంటుంటారు. అయితే కోట్లు పోసి కష్టపడి కొనుక్కున్న కలల అపార్ట్మెంట్ కళ్ల ముందే నాశనం ఐతుంటే ఎలా ఉంటది. ఔను ఇది చూస్తే మీకు కూడా మస్తు బాధైతది. 

ALSO READ | కర్ణాటకలో కొత్త రిజిస్ట్రేషన్ రూల్.. బెంగళూరులో ఇల్లు కొంటున్న తెలుగోళ్లకు అలర్ట్..

వివరాల్లోకి వెళితే ఇటీవల నోయిడాలో కురిసిన వర్షాల దాటికి ఖరీదైన అపార్ట్మెంట్లకు కూడా డ్యామేజ్ అయ్యింది. ఒకపక్క భూమిమీద పదుల ఏళ్ల వయస్సుండే ఇళ్లకు కూడా అంత డ్యామేజ్ జరగటం లేదు. అయితే నోయిడా నగరంలో వర్షాలతో పాటు గాలులతో ఇళ్ల కిటికీలు, బాల్కనీలు డ్యామేజీ కావటం వాటి భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలు నిర్మాణాల క్వాలిటీపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు దండుకుని ఇల్లు హ్యాండోవర్ చేసి చేతులు దులుపుకునే బిల్డర్లు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఇళ్లలో నివసిస్తున్న వారు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. 

వాస్తవానికి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు నోయిడా పెట్టింది పేరు. కానీ అక్కడ నిర్మాణాలు దానికి అనువైన రీతిలో లేవని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. పశ్చిమ నోయిడాలోని సూపర్ టెక్ ఎకోవిలేజ్ లోని ఒక ఇంటి బాల్కనీ మెుత్తం గాలులకు ధ్వంసమైన ఫొటోలను ఆ ఫ్యామిలీ పంచుకుంది. తృటిలో తమ కుటుంబం తప్పించుకుందని, నాశికరం నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎక్స్ పోస్ట్ వైరల్ అవుతోంది. 

మరో సంఘటనలో జేపీ అమర్ సొసైటీలో ఒక అపార్మెంట్ విండోలో గాలుల థాటికి ఊడిపడిపోవటం ఆందోళన కలిగించింది. ఇంత దారుణ నిర్మాణ క్వాలిటీ చూసి గృహ కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కోట్లు పోసి కొన్న ఇళ్లు ఇంత నాసిరకం క్వాలిటీవా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కవానకు ఉక్కిరిబిక్కిరైన ఇళ్లు.. రేపు తమకు అలా భత్రతను అందించగలవంటూ వాపోతున్నారు. ప్రసారమాధ్యమాల్లో వీటివై వస్తున్న కథనాలు రియల్టీ రంగాన్ని కూడా దెబ్బతీస్తోంది. అలాగే నోయిడా లాంటి ప్రధాన మెట్రో నగరాల్లో అపార్మెంట్లు కొనుగోలు చేసే చాలా మందిలో వాటి నిర్మాణ క్వాలిటీలపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.