చిరంజీవి హీరోగా 158వ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. బాబీ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా, ముహూర్తపు షాట్‌కు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల కెమెరా స్విచ్చాన్ చేశారు. వీవీ వినాయక్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. బి. గోపాల్, కోదండరామి రెడ్డి, నాగబాబు చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు.
శుక్రవారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మ్యాసీవ్ స్కేల్, ఇంటెన్సిటీతో నిండిన ఈ కథలో చిరంజీవి తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ తెలియజేశారు. ‘ఛాంపియన్’ ఫేమ్ అనస్వర రాజన్ కీలక పాత్రలో నటించనుంది. ఈ చిత్రం కోసం టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది.
తమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆంటోని రూబెన్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. మరోవైపు కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఎడిషనల్ స్క్రీన్‌ప్లే రైటర్లుగా వర్క్ చేస్తున్నారు. భాను,- నందు డైలాగ్స్ రాస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.
