
స్టార్ డైరెక్టర్ సుకుమార్– ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. నేషనల్ క్రష్ రష్మిక మందనా హీరోయిన్ గా వస్తున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మొదటి భాగం పుష్ప ది రైజ్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే.. పుష్ప 2 గురించి వస్తున్న చిన్న అప్డేట్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో మెగా డాటర్ నిహారిక కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ పై మూవీ టీం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకక్కిస్తున్న ఈ చిత్రానికి.. దేవీశ్రీ సంగీతం అందిస్తున్నాడు. విలన్గా మళయాల నటుడు ఫాహద్ ఫాజిల్.. ఇతర పాత్రల్లో సునీల్, రావు రమేష్, ధనుంజయ, అనసూయ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.