
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకి పైగా హీరోలు ఉన్నారు. ఒకరిద్దరు తప్ప అందరూ టాలీవుడ్ లో స్టార్స్ గానే వెలుగొందుతున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా నిహారిక కొనిదెల(Niharika Konedala) ఐదు సినిమాల వరకు చేసింది. అయితే ఆశించిన స్థాయిలో ఆమె సక్సెస్ కాలేకపోయింది. పింక్ ఎలిఫెంట్(Pink Elephant) అనే బ్యానర్ పెట్టి వెబ్ సిరీస్ లను నిహారిక ప్రస్తుతం నిర్మిస్తోంది.
రీసెంట్ గా డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో లీడ్ రోల్ లో ఆమె నటించడం విశేషం. అమెజాన్ తో కలిసి మరో వెబ్ సిరీస్ కి నిహారిక ప్లాన్ చేస్తోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. దీని తర్వాత బిగ్ స్క్రీన్ పైకి అడుగుపెట్టి నిర్మాతగా సినిమాలు చేస్తానని నిహారిక చెబుతోంది.
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి పెద్ద కూతరు సుస్మిత(Sushmita) నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. రెండు చిన్న సినిమాలు, ఒక వెబ్ సిరీస్ నిర్మించింది. ఇప్పుడు ఏకంగా తండ్రి హీరోగా పెద్ద ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించే పనిలో ఉంది. మెగాస్టార్ కూడా కూతురుని మెగా ప్రొడ్యూసర్ గా నిలబెట్టడానికి తనవంతు సాయం చేస్తున్నాడట. ఇప్పుడు అక్క దారిలోనే నిహారిక కూడా బిగ్ స్క్రీన్ పైకి వచ్చి ప్రొడ్యూసర్ గా మారాలని భావిస్తోంది.