11వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

11వేల పోస్టులతో  మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..  తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ ను  సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో  విడుదల  చేశారు. 11వేల 62 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.  గతంలో అప్లై చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.  కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్లు మాత్రం రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2024 మార్చి 04వ తేదీ నుంచి ఏప్రిల్ 02 వరకు దరఖాస్తులు అన్ లైన్ లో స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల ఆన్ లైన్ లో  డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తారు.  పరీక్ష తేదీలను త్వరలో ప్రభుత్వం ప్రకటించనుంది. అభ్యర్థుల వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 46గా నిర్థారించారు.  

కాగా గతేడాది సెప్టెంబరు 6న 5 వేల 89 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను ఫిబ్రవరి 28 బుధవారం రాత్రి రద్దు చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.  తాజాగా పోస్టులను అదనంగా పెంచి నోటిఫికేషన్‌ ఇచ్చింది. 


​​​​​