ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి తరఫున సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేసారు.ఇవాళ ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు.చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా దేశవ్యాప్తంగా ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు.
ఫిలిం ఇండస్ట్రీ నుండి రజినీకాంత్ సతీసమేతంగా చేరుకోగా స్టేట్ గెస్ట్ హోదాలో మెగాస్టార్ చిరంజీవి కూడా సభాస్థలికి చేరుకున్నారు. చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ స్పెషల్ బస్సులో అక్కడికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.