
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర ప్రాజెక్టు చేస్తున్నారు. బింబిసార దర్శకుడు వశిష్టతో సోషియో ఫాంటసీలో ఈ మూవీ రానుంది. భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దాదాపు రూ.200 నుంచి 300 కోట్లు ఖర్చు చేస్తున్నారట మేకర్స్.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం..చిరు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రీసెంట్ గా చిరుకి భారీ డిజాస్టర్ ని కట్టబెట్టిన డైరెక్టర్ తో మళ్ళీ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేనండీ..భోళా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేష్ తో.ఈ డైరెక్టర్ ని ఇప్పట్లో కాదు..ఎప్పుడు మెగా ఫ్యాన్స్ మరిచిపోలేరు. ఎందుకో అందరికీ తెలిసిందే. అంతలా డిజాస్టర్ ఇచ్చాడు మరి. ఇప్పుడు ఈ డైరెక్టర్ తో సినిమా అనే ముచ్చట ఎందుకొచ్చిందంటే..
రీసెంట్గా చిరంజీవిని కొంతమంది డైరెక్టర్స్ విశ్వంభర షూటింగ్ సెట్స్ లో కలిశారు.వారు చిరుతో దిగిన సెల్ఫీ లో మెహర్ రమేష్ కూడా ఉండటంతో..మరో సినిమా చేస్తున్నట్లు వార్తలు షురూ అయ్యాయి. అంతేకాదు..మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. 'ఇంకోసారి ఆయనకు అవకాశం ఇవ్వద్దొన్నయ్యా..అంటూ కొంతమంది కామెంట్లు పెడుతుండగా..'ఫ్లాప్ ఇచ్చినా క్లోజ్ గా ఉంటున్నారంటే అది చిరు గొప్పతనమని' మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Met #PadmaVibhushan #Megastar
— Meher Ramesh ?? (@MeherRamesh) April 11, 2024
our ANNAYYA sri @KChiruTweets
Invited to May 4th @ LB Stadium
“Telugu Film Directors Day”
event along with team #TFDA president VeeraShankar,Vasishta ,SaiRajesh,Anudeep,Sriram Aditya,Subbareddy at #Viswambhara sets pic.twitter.com/UNyn1Ya419
ఇదిలా ఉండగా..చిరంజీవిని కలవడంపై మెహర్ రమేష్ తన X లో పోస్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. " "పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యను కలిశాను. ఎల్బీ స్టేడియంలో మే 4వ తేదీన జరగనున్న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే ఈవెంట్ కు ఆహ్వానించాను. టీఎఫ్డీఏ ప్రెసిడెంట్ వీరశంకర్ తోపాటు పలువురితో కలిసి వెళ్లి ఆయనను విశ్వంభర సెట్స్‌లో కలిశాం" అని స్పష్టతనిచ్చారు. దీంతో హమ్మయ్య బతికించావు భయ్యా..అంటూ మెగా ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు.