ఆ హీరోయిన్ తో ప్రేమ నిజమే

ఆ హీరోయిన్ తో ప్రేమ నిజమే

సాయి తేజ్ 'విరూపాక్ష'విడుదలకు సిద్ధమైంది. దీంతో ప్రమోషన్ పనుల్లో ఈ హీరో బిజీగా మారాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీని రివీల్ చేశాడు. తనకు సమంత అంటే ఎంతో అభిమానమని తనను ఇప్పటికీ ఆదర్శంగా తీసుకుంటానని తెలిపాడు. కెరీర్ తొలినాళ్లలో తనతో సినిమాలు చేసిన రెజీనా సయామీని చాలా ఇష్టపడతానన్నాడు.

అయితే, తాను సీరియస్ గా ప్రేమించింది మాత్రం 'తిక్క'సినిమాలో తనతో నటించిన లారిస్సా బొనెస్సీనే అన్నాడు. ఆ విషయం ఆమెకు చెప్తే తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని సారీ చెప్పిందట. దాంతో తనకు గుండె పగిలినంత పనైందని చెప్పాడు. ఇక డిగ్రీలో తాను ప్రేమించిన అమ్మాయికి తానే దగ్గరుండి పెళ్లి | చేశానని ఆ విషయం తల్లితో పాటు పవన్ మామయ్యకు కూడా తెలుసంటూ వివరించాడు.