పోలీసు క్రీడల వేడుకల్లో మెగా పవర్ స్టార్

పోలీసు క్రీడల వేడుకల్లో మెగా పవర్ స్టార్

పోలీసు గేమ్స్ లో పోలీసు సిబ్బంది చాలా బాగా ఆడారన్నారు పోలీస్ కమిషర్ సజ్జనార్. పోలీసు శాఖలో కి ఎక్కువ మంది మహిళలు వస్తున్నారని తెలిపారు. మహిళా పోలీస్ సిబ్బంది కూడా గేమ్స్ లో బాగా ఆడారన్నారు. సైబరాబాద్  పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ క్లోసింగ్ ప్రోగ్రామ్ కు రామ్ చరణ్ రావడం సంతోషంగా ఉందన్నారు సీపీ సజ్జనార్. కార్యక్రమానికి వచ్చిన రామ్ చరణ్ ను సీపీ స్వయంగా వచ్చి స్వాగతం పలికారు. రామ్ చరణ్ కు ఓ మొక్కను బహూకరించారు. గేమ్స్ ఫైనల్స్ సందర్భంగా రామ్ చరణ్ తుపాకీ పేల్చారు.

ఆ తర్వాత మాట్లాడిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… పోలీసు గేమ్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. గెలిచిన సినిమాల కన్నా గెలవని సినిమాల నుంచే నేను ఎక్కువ గా నేర్చుకున్నాని చెప్పారు. సినిమా లో పోలీసు కథ చెప్పగానే ధ్రువ సినిమా చేసానని తెలిపారు. కోవిడ్ సమయంలో పోలీసులు చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు. కొత్త సంవత్సరం లో పోలీసులు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు.

ఆ తర్వాత ఆయా గేమ్స్ లో గెలుపొందిన వారికి సీపీ సజ్జనార్, రామ్ చరణ్ బహుమతులు అందజేశారు.