టాలీవుడ్ అగ్రకథానాయకులు చిరంజీవి, వెంకటేష్ కలిసి నటిస్తున్న ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి శుక్రవారం మ్యాసీవ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే రెండు పాటలతో ఇంప్రెస్ చేసిన మేకర్స్... థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
సెలబ్రేషన్ వైబ్స్‌ను క్రియేట్ చేస్తున్న ఈ పోస్టర్‌లో చిరంజీవి, వెంకటేశ్ స్టైలిష్ డాన్స్ పోజుల్లో కనిపించారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమో శనివారం విడుదల కాబోతోంది. న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోడానికి ఈ పర్ఫెక్ట్ సాంగ్ అని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. సాహు గరపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.
