గాడ్సే దేశభక్తుడే.. నేరాన్ని సమర్థించలేదు..

గాడ్సే దేశభక్తుడే.. నేరాన్ని సమర్థించలేదు..

మెగాబ్రదర్ నాగబాబు మంగళవారం నాథురాం గాడ్సే పుట్టినరోజు సందర్భంగా చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపింది. గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ ఆయన చేసిన ట్వీట్ పలువురి విమర్శలకు దారితీసింది. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడని పొగుడుతావా అంటూ చాలామంది నెటిజన్లు నాగబాబును తప్పుబట్టారు. దాంతో ఆయన స్పందిస్తూ మరో ట్వీట్ చేశారు. తాను గాడ్సే చేసిన నేరాన్ని సమర్థించడంలేదంటూ ఆయన అన్నారు. తనను విమర్శించే వాళ్లకన్నా గాంధీ అంటే తనకే చాలా గౌరవమని నాగబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఆయన తన ట్వీట్ లో.. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాథురాం గాడ్సే గురించి ఇచ్చిన ట్వీట్ లో నాథురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాథురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మగాంధీ అంటే చాలా గౌరవం. ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వాళ్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం’ అని పేర్కొన్నారు.

For More News..

విదేశాలలో చిక్కుకున్న వారితో ఏపీకి చేరుకున్న రెండు విమానాలు

వీడియో: కొడుకుకు హెయిర్ కట్ చేసిన సచిన్ టెండూల్కర్

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి

తన నిర్ణయాన్ని సమర్థించుకున్న డోనాల్డ్ ట్రంప్